ఇటీవల కాలంలో వాట్సప్ గురించి తెలియని వారు చాలా అరుదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు పక్కాగా వాట్సాప్ యూజ్ చేస్తారు. ఈ మధ్య వాట్సప్ వరుస ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటుంది.బీతాజాగా సోమవారం మరో క్రేజీ ఫీచర్‌తో ముందుకొచ్చింది. ‘యాక్సిడెంటల్ డిలీట్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మనం పంపాలనుకున్న వ్యక్తికి లేదా గ్రూప్‌కు కాకుండా మరొకరికి మెసేజ్ పంపి, పొరపాటున డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌కి బదులుగా ‘డిలీట్ ఫర్ మీ’పై పొరపాటున క్లిక్ చేయడం జరుగుతూ ఉంటుంది.
దీంతో అవతలి వారికి ఈ మెసేజ్ కనిపిస్తూనే ఉంటుంది. దీని వల్ల కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ అసౌకర్యాన్ని గుర్తించింది వాట్సాప్. ఈ సమస్యను పరిష్కరించడానికి, యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాక్సిడెంటల్‌గా డిలీట్ ఫర్ మీ చేసిన మెసేజ్‌ను రివర్స్ చేయడానికి ఐదు సెకన్ల సమయాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు అన్ డూ(Undo) చేస్తే.. మళ్లీ యధావిధిగా మెసేజ్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ చేసేందుకు వీలుంటుంది.
యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజులు వాడుతున్న వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. గత నెలలో, ఇండియాలో కొత్తగా ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. దీని ద్వారా యూజర్ తనకు తానే మెసేజ్ పంపుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా నోట్స్, రిమైండర్స్, అప్‌డేట్స్, ఫైల్స్ సేవ్ చేసుకొవచ్చు. వాట్సాప్‌ను నోట్‌ప్యాడ్‌గా యూజ్ చేసుకోవచ్చు.
