నేటి యువత ఎక్కువగా సతమతమయ్యే సమస్యల్లో బ్రేకప్ ఒకటి. అయితే మీరు కూడా బ్రేకప్ నుండి బయట పడాలి అనుకుంటున్నారా.. బ్రేకప్ బాధ నుండి ఎలా బయటపడాలని తెగ ఆలోచిస్తున్నారా..? అయితే ఇలా చేసి చూడండి..
భవిష్యత్తు గురించి ఆలోచించండి:
ముందు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో మీ గోల్స్ ఏంటి వంటి వాటిపై మీరు దృష్టి పెడితే ఖచ్చితంగా బ్రేకప్ బాధ నుండి బయటపడే అవకాశం ఉంది.
మీ బలహీనత తెలుసుకోండి:
మీరు మీ బలాన్ని, బలహీనతని తెలుసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు మీ పార్టనర్ ని ఎంచుకోండి. అప్పుడు కచ్చితంగా ఏ బాధ ఉండదు. ఆనందంగా జీవించేందుకు వీలవుతుంది.
స్నేహితులతో గడపండి:
బ్రేకప్ వలన మీరు ఒంటరిగా ఉండడం కంటే కూడా మీ స్నేహితులతో మీ ఆనందాన్ని పంచుకోండి. వారితో కాసేపు గడిపి ఏ బాధ లేకుండా హాయిగా ఉండండి.
ప్రస్తుతాన్ని ఆనందించండి:
చాలామంది గతాన్ని తలుచుకుని తెగ బాధ పడుతూ ఉంటారు. దాని వలన ప్రెసెంట్ లో సరిగ్గా ఉండలేరు. పదేపదే గతాన్ని తలుచుకొని బాధ పడేకంటే ప్రెసెంట్ ని ఎంజాయ్ చేయండి.
మీతో మీరు ఆనందంగా ఉండండి:
మీతో మీరు ఆనందంగా ఉండడాన్ని నేర్చుకోండి. దాని వలన కచ్చితంగా బ్రేకప్ నుండి బయటపడే ఆస్కారం ఉంది.
ఇతరుల సలహా తీసుకోండి:
ఇతరుల సలహా తీసుకుని మీరు బ్రేకప్ బాధ నుండి బయటపడొచ్చు. అలానే మీరు మీ లక్ష్యాలపై ఏకాగ్రత పెట్టడం, దానికి తగ్గట్టుగా కష్ట పడడం వంటివి చేస్తే కచ్చితంగా బ్రేకప్ నుండి బయటపడటానికి అవుతుంది.