బాలయ్య హీరోగా శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న వీరిసింహారెడ్డి సెట్‌లో పవన్ కళ్యాణ్ రావడం సినీ, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ .. పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ దర్శకత్వంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నిర్మిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్.. త్వరలో బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ షోలో సందడి చేయనున్నారు. త్వరలో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది.
ఈ షోలో పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్, క్రిష్ కూడా పాల్గొననున్నారు. అయితే బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సెట్‌కు పవన్‌కల్యాణ్ శుక్రవారం వెళ్లారు. అనుకోకుండా వచ్చిన పవన్‌ను చూసి చిత్రబృందం ఆశ్చర్యానికి గురైంది. ‘వీరసింహారెడ్డి’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది.
బాలకృష్ణ – శ్రుతిహాసన్‌లపై నృత్య దర్శకుడు ప్రేమ్‌రక్షిత్ నేతృత్వంలో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. అదే స్టూడియోలో పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ కూడా జరుగుతోంది. శుక్రవారం తన షూటింగ్ విరామ సమయంలో ‘వీరసింహారెడ్డి’ సెట్‌కు పవన్ వెళ్లారు. ఆయనతోపాటు దర్శకుడు క్రిష్, నిర్మాత ఎ.ఎం.రత్నం తదితర చిత్రబృందం కూడా ఉంది. సెట్లోనే ఉన్న బాలకృష్ణ, నిర్మాత యలమంచిలి రవిశంకర్.. పవన్‌కల్యాణ్‌ని ఆహ్వానించి ఆయనతో సరదాగా ముచ్చటించారు.