మీరు వింటుంది కరెక్టే.. రాజీనామా చేసింది వైసీపీ ఎమ్మెల్యేనే కానీ షాక్ మాత్రం టిడిపికి. విశాఖపట్టణం నే రాజధానిగా చేయాలంటూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి దానిని జేఏసీ ప్రతినిధులకు అందచేశారు.
రాజీనామా లేఖను వికేంద్రీకరణ సాధనకోసం ఏర్పడిన జేఏసీ ప్రతినిధులకు అందజేశారు. విశాఖను రాజధానిగా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ధర్మశ్రీ తప్పు పట్టారు. ఇక్కడితో అయిపోలేదు. ఉత్తరాంధ్ర బాగు కోరుకుంటే అచ్చన్నాయుడు తక్షణం రాజీనామా చేయాలని సవాలు చేశారు. అలాగే అచ్చన్నాయుడుపై తాను పోటీకి చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.
అయితే దీనిపై స్పందిస్తున్న టిడిపి సోషల్ మీడియా గతంలో ధర్మ శ్రీ అమరావతి ఏపీ రాజధాని గా కట్టుబడి ఉన్నాం అంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలను షేర్ చేస్తున్నారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఎప్పుడు ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చదవద్దని చెబుతున్నారు స్పీకర్ ఫార్మేట్ లో కారణం రాయరనీ.. ఇదంతా ఒక నాటకం అనీ.. కొంతమంది నేటిజన్లు అభిప్రాయపడుతున్నారు.